18 May 2025

The Crucial Role of Parents in JEE/NEET Preparation

 Dos and Don’ts for Ensuring Success

Preparing for highly competitive exams like JEE and NEET demands unwavering focus and discipline over two full years. These two years can determine a student’s academic future, and even total dedication cannot guarantee success due to the intense national-level competition. In this journey, parents have a pivotal role — not just in offering moral support but in creating an environment free from distractions.

Here’s a comprehensive guide on what parents should and shouldn’t do during these critical years.

Why Every Day Counts

  • These exams demand consistent daily effort — every class, every test, and every assignment matters.
  • Even one day of absence can set a student back by several days:
    • Classes focus on problem-solving techniques not found in textbooks.
    • Missed lectures mean missed opportunities to clarify doubts.
    • Catching up leads to backlogs, as new topics keep adding up daily.

Common Mistakes Parents Make

  1. Requesting breaks and holidays for casual reasons like family functions, festivals, or travel.
  2. Sending students late after term breaks or vacations.
  3. Planning vacations during crucial preparation windows like summer or Dasara holidays.
  4. Pressuring colleges to allow unnecessary leaves.
  5. Diluting seriousness by implying it’s okay to miss a class or test.

The All-India Competitive Reality

  • Most Indian boards don’t have public exams in Class 11, but in Telangana, students lose nearly two months for Intermediate First Year exams.
  • If students don’t study seriously during April and May, they fall behind by 5 months compared to their peers across India.
  • This gap is often impossible to bridge, especially given the pace and depth of the JEE/NEET syllabus.

Dos for Parents

  • Set clear expectations with your child about the level of commitment required.
  • Prioritise academics over all social and family obligations for these two years.
  • Communicate to your child that their presence is not essential for birthdays, festivals, or family events.
  • Work with the college management, not against it.
    • Understand schedules and test calendars in advance.
    • Ensure timely return after vacations.
  • Reinforce discipline and routine:
    • Encourage your child to treat assignments and tests seriously.
    • Avoid allowing absences unless there is a genuine emergency.
  • Stay in regular touch with faculty and administration to track progress and be informed.

Don’ts for Parents

  • Don’t take preparation lightly — your child mirrors your attitude.
  • Don’t argue with college authorities for casual permissions.
  • Don’t let social pressures dictate your child’s availability.
  • Don’t allow your child to skip or delay rejoining after vacations.
  • Don’t assume they can catch up on missed classes later — live instruction and doubt clearance cannot be replaced by notes.

Final Thoughts

Your child’s success in JEE/NEET is not just a result of their hard work — it’s also built on the supportive environment you create. Parents must lead by example, showing that sacrifices today are investments in their child’s future.

By shielding students from unnecessary distractions, you help instill seriousness, discipline, and a sense of purpose — the true foundations of success in any competitive exam.

JEE/NEET preparation లో తల్లిదండ్రుల పాత్ర

ఫలితాల కోసం తల్లిదండ్రులు చేయవలసినవి మరియు చేయకూడనివి

JEE మరియు NEET వంటి అత్యంత పోటీ పరీక్షల కోసం సిద్ధపడటానికి రెండు సంవత్సరాలపాటు అచంచలమైన దృష్టి మరియు క్రమశిక్షణ అవసరం. ఈ రెండు సంవత్సరాలు విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించగలవు. పోటీ తీవ్రతను దృష్టిలో ఉంచుకుంటే, పూర్తి నిబద్ధతతో కూడిన శ్రమ చేసినా విజయానికి హామీ ఇవ్వలేము. ఈ ప్రాధాన్యత గల ప్రయాణంలో తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలి — కేవలం మానసికంగా సహాయం చేయడమే కాక, distractions లేని study environment అందించాలి.

ఈ కీలక సంవత్సరాల్లో తల్లిదండ్రులు చేయాల్సినవి మరియు చేయకూడనివి ఇక్కడ స్పష్టంగా ఇవ్వబడ్డాయి.

ఎందుకు ప్రతి రోజు విలువైనది

  • ఈ పరీక్షలు ప్రతిరోజూ స్థిరమైన శ్రమను డిమాండ్ చేస్తాయి — ప్రతి క్లాస్, ప్రతి టెస్ట్, ప్రతి అసైన్‌మెంట్ ముఖ్యం.
  • ఒక రోజు absent కావడం కూడా విద్యార్థిని అనేక రోజుల వెనుకకు నెట్టేస్తుంది:
    • తరగతుల్లో పాఠ్యపుస్తకాల్లో లేని సమస్య పరిష్కార పద్ధతులు (problem solving techniques) చెబుతారు.
    • హాజరు కాకపోతే సందేహాల నివృత్తి అవకాశం కోల్పోతారు.
    • కొత్త సిలబస్ రోజుకో కొత్తగా చేరుతుండడంతో బ్యాక్లాగ్ (backlog) పెరుగుతుంది.

తల్లిదండ్రులు తరచుగా చేసే పొరపాట్లు

  1. కుటుంబ వేడుకలు, పండుగలు లేదా ప్రయాణాల కోసం విద్యార్థికి సెలవు కోరటం.
  2. సెలవుల తర్వాత విద్యార్థిని ఆలస్యంగా పంపించడం.
  3. వేసవి లేదా దసరా సెలవుల్లో ఔట్స్టేషన్ ట్రిప్స్ ప్లాన్ చేయడం.
  4. విద్యాసంస్థలపై ఒత్తిడిసెలవుల కోసం.
  5. తరగతులు మిస్ అవడం సర్వసాధారణమే అనే తప్పుడు సంకేతం విద్యార్థికి ఇవ్వడం.

జాతీయ స్థాయి పోటీ వాస్తవం

  • భారతదేశంలోని చాలా బోర్డ్లలో 11 తరగతికి పబ్లిక్ ఎగ్జామ్ ఉండదు, కానీ తెలంగాణలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల వల్ల రెండు నెలలు నష్టమవుతాయి.
  • విద్యార్థి ఏప్రిల్, మే నెలల్లో సీరియస్గా చదవకపోతే, దేశం నలుమూలల నుండి సీరియస్‌గా చదువుతున్న వారితో 5 నెలల వెనుకబడతాడు.
  • ఈ గ్యాప్‌ను పూడ్చటం చాలా కష్టమైన పని.

తల్లిదండ్రులు చేయవలసినవి (Dos)

  • పిల్లలతో స్పష్టమైన అంచనాలు సెట్ చేయండి.
  • ఈ రెండు సంవత్సరాల పాటు సామాజిక మరియు కుటుంబ కార్యక్రమాల కంటే చదువును ప్రాముఖ్యత ఇవ్వండి.
  • కుటుంబ వేడుకలు, పుట్టినరోజులు, పండుగల విషయంలో కూడా విద్యార్థి హాజరు అవసరం లేదని చెప్పండి.
  • కళాశాల యాజమాన్యంతో కలిసి పనిచేయండి, వ్యతిరేకంగా కాదు:
    • షెడ్యూల్స్ మరియు పరీక్ష తేదీలను ముందుగా తెలుసుకోండి.
    • సెలవుల తర్వాత సకాలంలో తిరిగి పంపండి.
  • శ్రద్ధ మరియు నియమాన్ని విద్యార్థిలో నాటండి:
    • టెస్టులు మరియు అసైన్‌మెంట్లను ప్రాముఖ్యతతో తీసుకోవాలనే సందేశం ఇవ్వండి.
    • అత్యవసరమైతే తప్ప తరగతులు మిస్ కావద్దు.
  • నియమితంగా కాలేజీ మేనేజ్మెంట్తో టచ్లో ఉండండి.

తల్లిదండ్రులు చేయకూడనివి (Don’ts)

  • JEE/NEET preparation తేలికగా తీసుకోకండి — మీ దృష్టికోణాన్ని పిల్లలు అనుసరిస్తారు.
  • తేలికపాటి సెలవుల కోసం కళాశాల అధికారులతో వాదించకండి.
  • సామాజిక ఒత్తిళ్లకు లోనై విద్యార్థిని పంపించకండి.
  • సెలవుల తర్వాత విద్యార్థిని ఆలస్యంగా పంపకండి.
·       “పుస్తకాలు (Notes) చాలు, తరువాత చదువుకుంటాడు” అనే  తప్పు భావన నమ్మకండిప్రత్యక్ష బోధనకు alternative లేదు.

చివరగా

విద్యార్థి కృషి ఒక్కటే కాదు — మీరు కల్పించే పఠన వాతావరణం కూడా విజయాన్ని నిర్ణయిస్తుంది. తల్లిదండ్రులు, పిల్లల భవిష్యత్తు కోసం తామూ కొంత త్యాగం చేయాలి.

Distractions నుంచి విద్యార్థిని రక్షించండి, క్రమశిక్షణ, Seriousness, లక్ష్యమై నిబద్ధత అనే విలువలు పునాదిగా ఉంటేనే, JEE/NEET లాంటి పరీక్షల్లో విజయం సాధ్యమవుతుంది.

Leave a Reply